సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
తమ్మినేని వీరభద్రం అరెస్ట్
Jul 6 2017 1:55 PM | Updated on Sep 5 2017 3:22 PM
హైదరాబాద్: ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ప్రగతి భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, జాన్ వెస్లీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement