వైఎస్ మార్గంలో కాంగ్రెస్ | Congress in YS way | Sakshi
Sakshi News home page

వైఎస్ మార్గంలో కాంగ్రెస్

Sep 3 2016 1:19 AM | Updated on Mar 18 2019 7:55 PM

వైఎస్ మార్గంలో కాంగ్రెస్ - Sakshi

వైఎస్ మార్గంలో కాంగ్రెస్

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపించిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని టీపీసీసీ పేర్కొంది.

టీపీసీసీ నివాళి

 సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపించిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని టీపీసీసీ పేర్కొంది. శుక్రవారం వైఎస్ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఘన నివాళులర్పించింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి డి.కె.అరుణ, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పీసీసీ నేతలు మాట్లాడుతూ, దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి గొప్ప దార్శనికుడని, పేదల పట్ల అభిమానం చూపించిన మానవతావాది అని కొనియాడారు. వైఎస్ చూపించిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement