కాంగ్రెస్‌కు అద్భుత భవిష్యత్‌ | Congress has fantastic future | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు అద్భుత భవిష్యత్‌

Mar 19 2018 1:09 AM | Updated on Mar 18 2019 9:02 PM

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి భవిష్యత్‌ ఉందని పంచాంగకర్త గొట్టిపాల తిరుమల శాస్త్రి జోస్యం చెప్పారు. ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ చేసే పోరాటాలు విజయం సాధిస్తాయన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది వేడు కలు ఘనంగా జరిగాయి. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నేతలంతా ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లడంతో టీపీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం పంచాంగ పఠనం చేసిన తిరుమల శాస్త్రి.. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్‌ ఉందని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజల్లో మంచి ఆదరణ పొందుతారని చెప్పారు. అక్టోబర్‌ తర్వాత ఉత్తమ్‌కు కలిసొస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి అల్లం భాస్కర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement