'చంద్రబాబు తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి' | Chandrababu rethink on Andhra Pradesh DGP selection, demands Nalla Suryaprakash | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి'

Jun 1 2014 2:51 PM | Updated on Jul 28 2018 3:23 PM

ఆంధప్రదేశ్ రాష్టానికి కొత్త డీజీపీ ఎంపిక విషయంలో ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్య ప్రకాశ్ సూచించారు.

ఆంధప్రదేశ్ రాష్టానికి కొత్త డీజీపీ ఎంపిక విషయంలో ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్య ప్రకాశ్ సూచించారు. ఆదివారం హైదరాబాద్లో నల్లా సూర్య ప్రకాశ్ మాట్లాడారు. తన సామాజిక వర్గానికి చెందిన జేవీ రాముడిని ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎంపిక చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

 

ఇప్పటి వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా వ్యవహరించిన బి.ప్రసాదరావును పక్కనపెట్టడంలో చంద్రబాబు అంతర్యమేమిటో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. డీజీపీ ఎంపిక విషయంలో చంద్రబాబు మరోసారి ఆలోచిస్తే మంచిదన్నారు. అయితే ఇదే అంశంపై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని నల్లా సూర్యప్రకాశ్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement