‘‘మీరంతా బాగా పనిచేస్తున్నట్లయితే ఫైళ్లెందుకు ముందుకు కదలడం లేదు’’ అని భూపరిపాలన కార్యాలయ సిబ్బందిని ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్ ప్రశ్నించారు.
భూపరిపాలన కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించిన సీసీఎల్‌ఏ
సాక్షి, హైదరాబాద్: ‘‘మీరంతా బాగా పనిచేస్తున్నట్లయితే ఫైళ్లెందుకు ముందుకు కదలడం లేదు’’ అని భూపరిపాలన కార్యాలయ సిబ్బందిని ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్ ప్రశ్నించారు. భూపరిపాలన కార్యాలయంలోని వివిధ సెక్షన్లలో మొత్తం 16 వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాలని ఆయన ఆదేశించారు.
ఫైళ్లు రాయడం, వ్యక్తిగత రిజిస్టర్లను నిర్వహించడం.. తదితర అంశాలపై సిబ్బందికి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. త్వరలోనే సీసీఎల్‌ఏ కార్యాలయాన్ని ఈ-ఆఫీస్‌గా మార్చబోతున్నామని, దీని ద్వారా ఫైళ్ల సర్క్యులేషన్లో జాప్యాన్ని నివారించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు వీలవుతుందని అన్నారు.