గది శుభ్రం చేయాలని పిలిచి అఘాయిత్యం | called to clean up the room | Sakshi
Sakshi News home page

గది శుభ్రం చేయాలని పిలిచి అఘాయిత్యం

Nov 14 2016 12:46 AM | Updated on Oct 17 2018 5:43 PM

గది శుభ్రం   చేయాలని పిలిచి అఘాయిత్యం - Sakshi

గది శుభ్రం చేయాలని పిలిచి అఘాయిత్యం

నాల్గో అంతస్తులోని గదిని శుభ్రం చేయాలని ఆఫీస్ బాయ్ దుర్గాప్రసాద్ అలియాస్ బాబీ(25) ఆమెను పిలిచాడు.

బంజారాహిల్స్: ఓ సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తున్న యువతిని గది శుభ్రం చేయాలని పిలిచిన ఆఫీస్ బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని ఉదయ్‌నగర్‌లో నివసించే యువతి(18) సమీపంలోని హెచ్‌బీఎల్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయంలో పని చేస్తోంది. ఈ నెల 10న నాల్గో అంతస్తులోని గదిని శుభ్రం చేయాలని ఆఫీస్ బాయ్ దుర్గాప్రసాద్ అలియాస్ బాబీ(25) ఆమెను పిలిచాడు.

ఆమె గది శుభ్రం చేస్తుండగా తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement