కోటలో ప్రారంభమైన బోనాలు | bonalu starts in golkonda fort | Sakshi
Sakshi News home page

కోటలో ప్రారంభమైన బోనాలు

Jul 7 2016 1:37 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గోల్కొండలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గోల్కొండలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కోటపై కొలువైన ఎల్లమ్మకు ఉదయం తొలిబోనం సమర్పణతో తెలంగాణలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. బోనాల ఎదుర్కోలు కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ లు హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటతోపాటు తొట్టెల ఊరేగింపు కొనసాగే బంజారాదర్వాజ్‌, ఫతేదర్వాజ్‌, నుంచి కోటకు దారి తీసే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement