
పార్టీ మారే ప్రసక్తే లేదు, నాపై దుష్ప్రచారం
తాను పార్టీ మారే ప్రసక్తే లేదని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: తాను పార్టీ మారే ప్రసక్తే లేదని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్రెడ్డి స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఆయన మాట్లాడుతూ...బీజేపీలోనే ఉంటానని కాంగ్రెస్లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కావాలనే కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ సభ్యునిగానే కొనసాగుతానని నాగం చెప్పారు. కాగా గత కొంతకాలంగా నాగం ...పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.