'టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది' | bjp leader muralidhar rao slams over trs govt | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది'

Jun 19 2016 5:00 PM | Updated on Mar 29 2019 6:01 PM

'టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది' - Sakshi

'టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది'

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఆదివారం హైదరాబాద్లో భేటీయ్యింది.

ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ....టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం రోజూ హత్యకు గురౌతుందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నియంతృత్వాన్ని, కుటుంబ పాలనను బీజేపీ మాత్రమే ఎదుర్కొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీలు మారే ఎమ్మెల్యేలు బీజేపీలో లేరని చెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తోందన్నారు. బీజేపీకి, ఇతర పార్టీలతో పోలికే లేదని మురళీధరరావు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement