'ఆ వ్యవస్థ కొనసాగటం దురదృష్టకరం' | bezwada wilson Honored by DG Vinay kumar singh | Sakshi
Sakshi News home page

'ఆ వ్యవస్థ కొనసాగటం దురదృష్టకరం'

Nov 22 2016 6:58 PM | Updated on Sep 4 2017 8:49 PM

రామన్ మెగసెసే అవార్డు అందుకున్న బెజవాడ విల్సన్‌ను డీజీ వినయ్‌కుమార్‌సింగ్ సత్కరించారు.

మెగసెసే అవార్డుగ్రహీత బెజవాడ విల్సన్
హైదరాబాద్:
సమాజం సాంకేతికంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ ... మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తే వ్యవస్థ ఇంకా కొనసాగడం దురదృష్టకరమని రామన్ మెగసెసే అవార్డుగ్రహీత, సఫాయి కర్మచారి ఆందోళన్ వ్యవస్థాపకుడు బెజవాడ విల్సన్ అన్నారు. సామాజిక సేవలో రామన్ మెగసెసే అవార్డు అందుకున్న విల్సన్‌ను మంగళవారం తెలంగాణ జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో డీజీ వినయ్‌కుమార్‌సింగ్ సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేసే కార్మికులు వేల సంఖ్యలో మరణిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాకీ వ్యవస్థను రూపుమాపడమే ధ్యేయంగా పోరాటాలు సాగిస్తానని బెజవాడ విల్సన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement