ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారమిక్కడ సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారమిక్కడ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.17వేల కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. తెలంగాణలో మోదీ పర్యటన మైలురాయిగా నిలిచిపోతుందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. 2020 నాటికి దేశంలో అందరికీ విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పిస్తామన్నారు.
కాగా ప్రధాని తొలిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.20గంటలకు ఆయన బేగంటపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 2.50 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్ చేరుకుంటారు. మూడు గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకూ గజ్వేల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలో పాల్గొంటారు.
సాయంత్రం 4.25 గంటలకు గజ్వేల్ నుంచి బేగంపేటకు తిరుగు పయనం అవుతారు. సాయంత్రం ఐదు గంటలకు బేగంపేట నుంచి ఎల్బీ స్టేడియానికి బయల్దేరతారు. 5.15 నుంచి 6.15గంటలకు వరకు బీజేపీ కార్యకర్తల సమ్మేళన్కు హాజరు అవుతారు. సాయంత్రం 6.40గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళతారు.