నగరంలోని షాపూర్‌నగర్ ప్రధాన రహదారిపై దుండగులు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డారు.
నగరంలోని షాపూర్‌నగర్ ప్రధాన రహదారిపై దుండగులు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రంగ, భుజంగ థియేటర్ సమీపంలో ఆటో నడుపుతున్న హనుమంతు అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం పరారయ్యారు. ఈ ఘటనలో ఆటో దగ్ధం కాగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం అందించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, 108 వాహనం వెంటనే రాకపోవడంతో కాలిన గాయాలతో హనుమంతు పడిన అవస్థలు చూసి స్థానికులు చలించిపోయారు.