
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో నియామకాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీల్లో బుధవారం పలువురి నియామకాలు జరిగాయి.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీల్లో బుధవారం పలువురి నియామకాలు జరిగాయి. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి శంకర్, కార్యదర్శులుగా చొక్కాల రాము, జాల మహేశ్ యాదవ్.. ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఎం.వి.రమణ, నల్లగొండ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పి.మెసయ్యనాయక్‌లను నియమించారు.
రాష్ట్ర ప్రైవేట్ లెక్చరర్లు, టీచర ్ల ఫోరం కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొర్ర కిషన్‌నాయక్, సంయుక్త కార్యదర్శిగా రావూరి వినోద్‌కుమార్, సలహాదారుగా సంగం గోపాలస్వామి, ప్రచార కార్యదర్శులుగా ఎ.శ్రీనివాస్, రాపాక ప్రమోద్, కోశాధికారిగా ఉట్టలూర్ గోపాలాచారి, ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నూకల వెంకట్‌రెడ్డిలను నియమించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి బీసీ, ఎస్టీ కమిటీల్లో నియామకాలు జరిపినట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ ఒక ప్రకటనలో తెలిపింది. వారిద్దరి అనుమతితో ప్రైవేట్ లెక ్చరర్లు, టీచర్ల ఫోరం అధ్యక్షుడు పి.బాలకృష్ణారెడ్డి టీచర్ల కమిటీలో పలువురిని నియమించినట్లు పేర్కొంది.