
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ను విజయవంతం గా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా రాయబారి కెన్నెత్.ఐ.జస్టర్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర సర్కా రు అద్భుతమైన ఏర్పాట్లు చేయడం వల్లే ఈ సమావేశాలు ఫలప్రదంగా ముగిశాయ న్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. సదస్సు సందర్భం గా తనను కలిసే అవకాశం కల్పించినందు కు జస్టర్.. కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ విధానాలను రూపొందించిందని ప్రశంసలు కురిపించారు.