నేను క్షేమంగానే ఉన్నాను: బాలయ్య | Am safe, says hero bala krishna | Sakshi
Sakshi News home page

నేను క్షేమంగానే ఉన్నాను: బాలయ్య

Jun 29 2016 7:56 PM | Updated on Aug 29 2018 1:59 PM

నేను క్షేమంగానే ఉన్నాను: బాలయ్య - Sakshi

నేను క్షేమంగానే ఉన్నాను: బాలయ్య

రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సినీనటుడు తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సినీనటుడు తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన మాట  వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని ఆయన వెల్లడించారు. తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా.. పూలమాల వచ్చి అద్దం మీద పడిందన్నారు. దాంతో  రోడ్డు సరిగా కనిపించక డివైడర్ ను గుద్దినట్లు బాలయ్య తెలిపారు.

(సినీనటుడు బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం) కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement