ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60కి పెంచడంతో ఉద్యోగుల ఆప్షన్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60కి పెంచడంతో ఉద్యోగుల ఆప్షన్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. త్వరలో పదవీ విరమణ చేసే ఉద్యోగులందరూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తామని ఆప్షన్ ఇస్తే చిక్కులు వస్తాయని భావిస్తోంది. దీంతో రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలనే అంశాన్ని మినహాయించాలని కమలనాథన్ కమిటీని కోరింది.
ఈ అంశంపై అభిప్రాయాన్ని తరువాత తెలియజేస్తామని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆమోదిస్తూ శనివారం వెనక్కు పంపించారు. అయితే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం అపాయింటెడ్ నుంచి ఉన్న ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లను తీసుకోవాలని, ఆపన్లను పరిగణనలోకి తీసుకునే ఉద్యోగుల కేటాయింపులు చేయాలని స్పష్టం చేస్తోంది.
ఈ సమస్య కారణంగా శుక్రవారం లేదా శనివారం విడుదల కావాల్సిన ముసాయిదా మార్గదర్శకాలు నిలిచిపోయాయి. మరోవైపురిటైరయ్యే ఉద్యోగుల నుంచి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనే విషయాన్ని తరువాత చెబుతూ మిగతా అంశాలపైముసాయిదా మార్గదర్శకాల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడాఇందుకు అంగీకరించిన పక్షంలో ఆ ఒక్క అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలపై కమలనాథన్ కమిటీ ముసాయిదా మార్గదర్శకాలను సోమలేదా మంగళవారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది. లేదంటే ముసాయిదా మార్గదర్శకాల విడుదలలో మరింత జాప్యం ఖాయం. ఉమ్మడిరాష్ట్రంలో ఈ ఏడాదితో పాటు వచ్చే రెండేళ్లలో 38 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.