నటుడు చలపతిరావు కేసు బదిలీ.. | Actor Chalapathi rao case transfer to Jubilee Hills police station | Sakshi
Sakshi News home page

నటుడు చలపతిరావు కేసు బదిలీ..

Aug 7 2017 7:45 AM | Updated on Sep 17 2017 5:16 PM

నటుడు చలపతిరావు కేసు బదిలీ..

నటుడు చలపతిరావు కేసు బదిలీ..

మహిళల కించపరిచే వ్యాఖ్యలు చేసిన సినీనటుడు చలపతిరావు కేసును చాదర్‌ఘాట్‌ పోలీసులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.

బంజారాహిల్స్‌: మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు చలపతిరావు కేసును చాదర్‌ఘాట్‌ పోలీసులు శనివారం  జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. గత మే నెల 18వ తేదీన బంజారాహిల్స్‌ రోడ్‌ నెం2లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన రారండోయ్‌ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో పాల్గొన్న చలపతిరావు ఓ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో మహిళలను కించపరిచేలా మాట్లాడారు.
 
ఈ సంఘటనపై అదే రోజు చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. దీంతో చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసును జూబ్లీహిల్స్‌కు బదిలీ చేశారు. జూబ్లీహిల్స్‌పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement