ఎల్‌బీనగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పనిచేసే డాక్యుమెంట్ రైటర్ మేకల వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
డాక్యుమెంట్ రైటర్ ఇంటిపై దాడులు
Jun 15 2017 11:55 AM | Updated on Aug 17 2018 12:56 PM
హైదరాబాద్: ఎల్‌బీనగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పనిచేసే డాక్యుమెంట్ రైటర్ మేకల వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. ఉప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి గురువారం ఉదయం వెళ్ళిన అధికారులు తనిఖీలు పట్టారు. వెంకట్‌రెడ్డి ఎల్బీనగర్‌లో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డికి బినామీగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక దస్తావేజులు గుర్తించినట్లు సమాచారం.
కాగా ఎల్బీనగర్ సబ్‌రిజిస్ట్రార్ రమేశ్‌చంద్రారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో రమేశ్‌చంద్రారెడ్డి ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రమేశ్ చంద్రారెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నాగోల్‌తో పాటు సరూర్‌నగర్, కొత్తపేట్, ఉప్పల్‌లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రమేశ్‌చంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు రామ చంద్రారెడ్డి సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరవనున్నారు.
Advertisement
Advertisement