ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్‌లైన్ అడ్మిషన్లు అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వెనుకడుగు వేయటం కార్పొరేట్ కళాశాలలకు రెడ్ కార్పెట్ పరచటమే అని ఏబీవీపీ ఆరోపించింది.
రేపు జూనియర్ కళాశాలల బంద్
Jun 13 2017 12:15 PM | Updated on Sep 5 2017 1:31 PM
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్‌లైన్ అడ్మిషన్లు అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వెనుకడుగు వేయటం కార్పొరేట్ కళాశాలలకు రెడ్ కార్పెట్ పరచటమే అని ఏబీవీపీ ఆరోపించింది. కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలు, విద్యార్థుల మిస్సింగ్ లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అంతేకాక, కార్పొరేట్ కళాశాలకు అమ్ముడు పోయిన ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ అశోక్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరింది. తమ డిమాండ్ల సాధనకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతానికి ఈనెల 14వ తేదీన జూనియర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చింది.
Advertisement
Advertisement