లోక్‌అదాలత్‌లో 75 వేల కేసుల పరిష్కారం | 75 thousand cases resolved in Lok Adalat | Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌లో 75 వేల కేసుల పరిష్కారం

Dec 13 2015 1:09 AM | Updated on Sep 17 2018 6:26 PM

లోక్‌అదాలత్‌లో 75 వేల కేసుల పరిష్కారం - Sakshi

లోక్‌అదాలత్‌లో 75 వేల కేసుల పరిష్కారం

జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన మెగా

సాక్షి, హైదరాబాద్: జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌లో 75,124 కేసులను పరిష్కరించినట్లు న్యాయసేవా సాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. పరిహారంగా రూ. 17.55 కోట్లు అందించామని చెప్పారు. ఇందులో 2,117 సివిల్ వివాదాలు, 51,502 క్రిమినల్ కేసులు, పోలీసు విచారణ దశలో ఉన్న 21,505 కేసులు ఉన్నాయని తెలిపారు.

ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 15,859 కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలే, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ నూతి రామ్మోహన్‌రావుల నేతృత్వంలో ఈ అదాలత్‌ను నిర్వహించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement