కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆహారం వికటించి బాలికలు అస్వస్థతకు గురయ్యారు.
కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆహారం వికటించి పలువురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఎన్‌ఆర్‌ఐ బాలికల వసతి గృహంలో గురువారం ఉదయం టిఫిన్ చేసిన బాలికల్లో 20 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. నిర్వాహకులు వారిని వెంటనే ప్రగతినగర్‌లోని పీపుల్స్ ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కలుషితాహారం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు.