సుల్తాన్‌బజార్‌లో రూ.20 కోట్లు చోరీ | 20 crores theft in sultan bazar | Sakshi
Sakshi News home page

సుల్తాన్‌బజార్‌లో రూ.20 కోట్లు చోరీ

Feb 23 2015 8:26 PM | Updated on Sep 2 2017 9:47 PM

నగరం నడిబోడ్డులో ఉన్నసుల్తాన్‌బజార్‌లో రూ.20 కోట్లు చోరీ జరిగింది.

సుల్తాన్‌బజార్(హైదరాబాద్ క్రైం): నగరం నడిబోడ్డులో ఉన్నసుల్తాన్‌బజార్‌లో రూ.20 కోట్లు చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సుల్తాన్‌బజార్‌లోని కపాడియా ఛారీటబుల్ ట్రస్ట్‌లో భారీ చోరీ జరిగినట్లు నిర్వాహకుడు సుశీల్‌కుమార్ తెలిపారు. శనివారం ట్రస్ట్‌కు తాళం వేసి వెళ్లిన సుశీల్‌కుమార్ సోమవారం వచ్చి చూసి ఆఫీస్‌లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఈ చోరీలో ఆఫీస్‌లో ఉన్న రూ. 20 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, రూ.2.50 లక్షల నగదు, రెండు కంప్యూటర్లు, ఐదు బీరువాలు, కొంత పర్నీచర్‌ను దొంగలించారని నిర్వాహకుడు తెలిపాడు. అత ని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement