లోక్‌ అదాలత్‌లో 28 వేల కేసులు పరిష్కారం 

28,000 cases in Lok Adalat settlement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా ఉభయ రాష్ట్రాల్లో శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 28 వేల కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో రూ.58 కోట్ల వరకు పరిహారం చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. ఏపీలో 18 వేల కేసులు పరిష్కారమైనట్లు ఆ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాంబాబు తెలిపారు. పరిహారం కింద రూ.32.4 కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రంలో 10 వేలు పరిష్కారం కాగా, రూ.26 కోట్ల మేర పరిహారం చెల్లించామని ఆ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బి.ఆర్‌.మధుసూదన్‌రావు తెలిపారు. ఈసారి హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కృతమయ్యాయి.

హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ అధ్యక్షుడు జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ నేతృత్వంలో శనివారం హై కోర్టులో లోక్‌అదాలత్‌ జరిగింది. జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ తో పాటు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ పి.కేశవరావు, జస్టిస్‌ గంగారావుతో పాటు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జి.వి.సీతాపతి లోక్‌ అదాలత్‌లో కేసులను విచారించారు. 119 కేసులను పరిష్కరించారు. ఈ కేసుల్లో 500 మందికి రూ.6.5 కోట్ల మేర పరిహారం చెల్లింపునకు న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేసినట్లు లీగల్‌ సర్విసెస్‌ కమిటీ ఇన్‌చార్జి కార్యదర్శి తెలిపారు.     

Read latest Hyderabad City News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top