ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల తీరు ఇది | The lack facilities for Inter practical | Sakshi
Sakshi News home page

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల తీరు ఇది

Feb 14 2016 10:47 AM | Updated on Sep 3 2017 5:39 PM

కనీస వసతులు లేకపోవడంతో ఇంటర్ విద్యార్థినులు ప్రాక్టికల్ పరీక్షలు చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

కనీస వసతులు లేకపోవడంతో ఇంటర్ విద్యార్థినులు ప్రాక్టికల్ పరీక్షలు చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం ఉదయం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బోటనీ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పీ బంగ్లా వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ల్యాబ్‌లు లేకపోవడంతో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇక్కడ కూడా ల్యాబ్‌లు లేకపోవడంతో పాఠశాల ఆవరణలో టేబుళ్లు వేసి మొక్కుబడిగా ప్రాక్టికల్స్ నిర్లహిస్తున్నారు. కళాశాలల్లో  ప్రాక్టికల్స్ చేయించకపోవడంతో విద్యార్థినులు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఆదోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్ విద్యార్థినుల జీవితాలతో చెలాగటమాడుతున్నారని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement