ప్రత్యేక హోదాపై సీపీఐ ప్రచారోద్యమం | Special status On CPI campaign | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై సీపీఐ ప్రచారోద్యమం

Jul 28 2015 4:15 AM | Updated on Sep 3 2017 6:16 AM

రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ...

1న శ్రీకాకుళంలో ప్రచార జాతా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ఆగస్టు 1నుంచి ప్రచారోద్యమాన్ని చేపట్టనున్నాయి. 9 రోజులు సాగే ఈ ప్రచార జాతా శ్రీకాకుళం నుంచి ప్రారంభమవుతుంది. 5న గుంటూరులో భారీ బహిరంగ సభ, 9న అనంతపురం లేదా హిందూపురంలో ముగింపు సభ జరుగుతుంది.

ప్రచార జాతా ప్రారంభ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేతలతో పాటు ఆంధ్రామేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కిసాన్ విభాగం కన్వీనర్ నాగిరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య నాయకుడు ఏర్నేని నాగేంద్ర తదితరులు పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement