సత్యదేవుడి వార్షికాదాయం రూ.122.59 కోట్లు.. | Satyadevudi income is Rs 122.59 crore per annum. | Sakshi
Sakshi News home page

సత్యదేవుడి వార్షికాదాయం రూ.122.59 కోట్లు..

Apr 4 2017 7:57 PM | Updated on Sep 27 2018 4:42 PM

సత్యదేవుడి వార్షికాదాయం రూ.122.59 కోట్లు.. - Sakshi

సత్యదేవుడి వార్షికాదాయం రూ.122.59 కోట్లు..

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.122.59 కోట్లు వచ్చాయని చైర్మెన్‌ తెలిపారు.

అన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.122 కోట్ల 59 లక్షల 79 వేల 867 ఆదాయం వచ్చినట్లు చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. దేవస్థానంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. 2015-16 సంవత్సర ఆదాయం రూ.118.95 కోట్లతో పోల్చితే రూ.3.60 కోట్లు మాత్రమే పెరుగుదల నమోదైందన్నారు.

నోట్ల రద్దు తదితర కారణాలతో ఆదాయం ఆశించినంతగా పెరగలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవస్థానానికి వచ్చిన ఆదాయంలో రూ.23.33 కోట్లు వ్రత విభాగం ద్వారానే వచ్చింది. మొత్తం ఆదాయంలో ఇదే సింహభాగం. కాగా, సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి 2016-17లో రూ.2.99 కోట్ల విరాళాలు వచ్చాయి. దీంతో నిత్యాన్నదాన ట్రస్ట్‌ మొత్తం విరాళాలు రూ.33.98 కోట్లకు పెరిగాయి. ఈ విరాళాలపై ఈ ఏడాది రూ.2.53 కోట్ల వడ్డీ రాగా, ఇతర విరాళాలు రూ.56 వేలు వచ్చాయి. ఈ మొత్తంతో 10.83 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement