రోడ్డు ప్రమాదంలో నాట్కో అధికారి మృతి | natco officer died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నాట్కో అధికారి మృతి

Jan 23 2016 12:12 PM | Updated on Sep 28 2018 3:41 PM

రోడ్డు ప్రమాదంలో నాట్కో అధికారి మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో నాట్కో అధికారి మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్జుగడ్డ తండా సమీపంలోని పీ-వన్ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.

శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్జుగడ్డ తండా సమీపంలోని పీ-వన్ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. నాట్కో కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న పి.కృష్ణారావు(48) శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని కారులో వస్తుండగా రోడ్డుపైకి అడవి పందులు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణారావు అక్కడికక్కడే చనిపోయారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement