అక్క మొగుడే హంతకుడు! | Murder suspect arrested in | Sakshi
Sakshi News home page

అక్క మొగుడే హంతకుడు!

Mar 10 2016 1:36 PM | Updated on May 10 2018 12:34 PM

ఈ నెల 7న రామచంద్రాపురం జంక్షన్ వద్ద హత్యకు గురైన సుబ్రహ్మణ్యం(26) హత్య కేసులో నిందితుడు సుబ్రహణ్యం అక్క భర్తే నని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

ఈ నెల 7న రామచంద్రాపురం జంక్షన్ వద్ద హత్యకు గురైన సుబ్రహ్మణ్యం(26) హత్య కేసులో నిందితుడు సుబ్రహణ్యం అక్క భర్తే నని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. తిరుపతిలోని జీవకోనకు చెందిన సుబ్రహ్మణ్యం, భాస్కర్ బావబామ్మర్థులు. సుబ్రహ్మణ్యం తన బావ భాస్కర్‌కు కొన్ని నెలల క్రితం రూ.లక్షన్నర అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వమని కొన్ని రోజులుగా అడుగుతున్నాడు.

ఈ నేపధ్యంలో ఈ నెల 7న మద్యం సేవించడానికి రామచంద్రాపురం జంక్షన్ వద్దకు ఇద్దరూ వెళ్లారు. మద్యం సేవించే సమయంలో అప్పు గురించి అడిగేసరికి భాస్కర్ కోపోద్రిక్తుడయ్యాడు. రెచ్చిపోయి బావమరిది సుబ్రహ్మణ్యంను చంపేశాడు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లలేదు. నాలుగు రోజులుగా ఇద్దరి కోసం కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. గురువారం రామచంద్రాపురం జంక్షన్ వద్ద సుబ్రహణ్యం మృతదేహం స్థానికుల కంటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement