పోలీసుల తీరుకు నిరసనగా వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట పలాస ఎమ్మెల్యే శ్యాంసుందర్ శివాజి బైఠాయించడం రాజకీయంగా కలకలం సృష్టించింది.
పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన ఎమ్మెల్యే
Oct 25 2015 7:10 PM | Updated on Aug 21 2018 9:20 PM
శ్రీకాకుళం: పోలీసుల తీరుకు నిరసనగా వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట అధికార పార్టీ ఎమ్మెల్యే శ్యాంసుందర్ శివాజి బైఠాయించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. మత్స్యకారులపట్ల పోలీసుల తీరుకు నిరసనగా ఆదివారం సాయంత్రం బైఠాయించారు.
మెట్టపల్లి మత్స్యకారులకు, స్థానిక మత్స్యకారులకు మధ్య చోటుచేసుకున్న వివాదంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. స్థానిక మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ శివాజి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.
Advertisement
Advertisement