ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం | mla gadari kishor's effigiy burnt by asha workers | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

Sep 6 2015 5:46 PM | Updated on Jul 11 2019 5:37 PM

తమనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఆశా వర్కర్లు.

మోత్కూర్: సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నల్లగొండ జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పై మహిళలు మండిపడ్డారు.

తమ సమస్యల గురించి అవహేళనగా మాట్లాడిన ఎమ్మెల్యే కిషోర్ దిష్టిబొమ్మను ఆశావర్కర్లు దహనం చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో ఆదివారం ర్యాలీ నిర్వహించిన ఆషావర్కర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను తగలబెట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement