పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం టీడీ రాయల్ అనే న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం టీడీ రాయల్ అనే న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఆయనకు నరికి చంపారు. స్థానికంగా ఉన్న గాంధీ స్కూల్ సమీపంలోని ఏసీ పరికరాలు విక్రయించే షాపులో రాయల్ ఉండగా కాపు కాసిన దుండగులు ఒక్కసారిగా షాపులోకి దూసుకువచ్చి వేటకొడవళ్లతో దాడి చేశారు. రాయల్ పట్టణంలో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియారాలేదు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దుండుగుల కోసం గాలిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.