వర్షప్రభావిత జిల్లాల్లో కాంగ్రెస్ నేతల పర్యటన | apcc chief raghuveerareddy to visit rain affected districts | Sakshi
Sakshi News home page

వర్షప్రభావిత జిల్లాల్లో కాంగ్రెస్ నేతల పర్యటన

Nov 25 2015 2:22 PM | Updated on Aug 1 2018 3:55 PM

భారీ వర్షాలు, వరదలకి నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలకి నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న మూడు జిల్లాల్లో వీరి పర్యటన కొనసాగనుంది. ఈ నెల  27న వైఎస్ఆర్ జిల్లా, 28న చిత్తూర్, 29న నెల్లూరు జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో పర్యటన సాగనుంది. ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్యతోపాటూ మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ పర్యటనలో పాల్గోనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, ఆస్తులు నష్టపోయిన వారి వివరాలు తెలుసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement