నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో బుధవారం గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించాడు.
శ్రీహరి కోట రాకెట్ కేంద్రంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎస్.కరణ్(33) అనే వ్యక్తిని షార్ భద్రతా సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. అనంతరం శ్రీహరి కోట పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా నవగార్ తాలుకా పరిధిలోని మొహిత్రి గ్రామానికి చెందిన కరణ్ దక్షిణం వైపు కేటీఎన్ గేట్ వద్ద తిరుగుతుండగా.. భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది ప్రశ్నించగా.. తాను సముద్రం అంచునే నడిచి వచ్చానని తెలిపాడు. అతడి సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు అప్పగించారు.