ఓ కప్ కాఫీతో గుండె ఆరోగ్యం పదిలం | Drink coffee for a healthy heart, a study says | Sakshi
Sakshi News home page

ఓ కప్ కాఫీతో గుండె ఆరోగ్యం పదిలం

Nov 21 2013 2:46 PM | Updated on Sep 2 2017 12:50 AM

ఓ కప్ కాఫీతో గుండె ఆరోగ్యం పదిలం

ఓ కప్ కాఫీతో గుండె ఆరోగ్యం పదిలం

ఎక్కువగా కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. ఈ సంగతి అటుంచితే రోజూ ఓ కప్ కాఫీ తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుందని వైద్య పరిశోధనలో తేలింది.

ఎక్కువగా కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. ఈ సంగతి అటుంచితే రోజూ ఓ కప్ కాఫీ తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఓ కప్ కాఫీ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని వెల్లడైంది. దీనివల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని పరిశోధనలో గుర్తించారు.

అమెరికా హర్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సమావేశంలో ఈ నివేదికను సమర్పించారు. 27 మంది పెద్దలపై ప్రయోగం చేశారు. కాఫిన్ కలిపిన కాఫీ తాగిన వారిలో 75 నిమిషాల వ్యవధిలో రక్తప్రసరణ 30 శాతం మెరుగైనట్టు గుర్తించారు. అలాగే కాఫిన్ కలపని కాఫీ తాగినవారిలో ఈ విధమైన మార్పు కనిపించలేదు. జపాన్లోని ఓకినావా యూనివర్సిటీ ఫార్మకాలజీ విభాగం ప్రొఫెసర్ మసాటో సుట్సుయ్ ఈ విషయాన్ని నివేదించారు. కాఫీ తాగే వారిలో గుండె ఎలా మెరుగ్గా పనిచేస్తుందో విశదీకరించారు. కాగా గతంలో కాఫీ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు కాలేయానికి ముప్పు ఏర్పడుతుందని పలు వైద్య నివేదికల్లో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement