పసుపు పచ్చని రోడ్డు తోడుంటే...

పసుపు పచ్చని రోడ్డు తోడుంటే...


విహారం

‘‘అక్కడ ఏయే ప్రదేశాలు చూసి వచ్చారు?’’ అని ఒకప్పుడు నెదర్లాండ్స్‌కు వెళ్లి వచ్చిన పర్యాటకులను అడిగితే.... వైబ్రెంట్  క్యాపిటల్ ‘ఆమ్‌స్టర్‌డమ్’ గురించి... అక్కడ ఉన్న గొప్ప చారిత్రక ఆర్ట్ గ్యాలరీలు, మ్యూజియమ్‌ల గురించి చెప్పేవారు.

 అంతేనా? టులిప్ పువ్వుల గురించి కూడా.

 టులిప్ పుష్పాలను చూడాలంటే నెదర్లాండ్‌‌సలోనే చూడాలి అంటుంటారు.



‘ద గార్డెన్ ఆఫ్ యూరప్’గా పేరున్న లిస్సే నగరంలోని  కెకెన్‌హాప్ గార్డెన్ గురించి మాత్రమే కాదు... హాగే నేషనల్ పార్క్ గురించి కూడా ప్రత్యేకంగా చెబుతుం టారు. 13,800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి స్కీడామ్ మాటేమిటి! అసలింతకీ అదేమిటి అంటారా? ‘బీద నగరం’ అంటే చప్పున  గుర్తుపడతారేమో!

 

నెదర్లాండ్‌‌సలోని స్కీడామ్ నగరంలో చారిత్రాత్మకమైన కాలువలు, ప్రపంచం లోనే  ఎత్తై గాలిమరలు తదితర ఆకర్షణలు ఉన్నప్పటికీ... పర్యాటకుల దృష్టిలోకి ఈ నగరం ఎప్పడూ వెళ్లలేదు. కానీ ఇప్పుడు మాత్రం నెదర్లాండ్‌‌సకు వచ్చే పర్యాటకులు స్కీడామ్ గురించి తప్పని సరిగా ఆరా తీస్తున్నారు. దీనికి కారణం.... ఎల్లో బ్రిక్ రోడ్డు!

 స్కీడామ్‌లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఎల్లో రోడ్ రూపు దిద్దుకుంది. పసుపురంగు సంతోషానికి, సేఫ్టీకి, సక్సెస్‌కి చిహ్నాలుగా అక్కడ భావిస్తారట.



అందువల్లే ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే... పనిలో విజయం సిద్ధిస్తుందని, ఐశ్వర్యం ఇంటి తలుపు తడుతుందని బలంగా నమ్ముతారు స్కీడామ్ వాసులు. ఇది ఎంత వరకు నిజమో తెలియదుగానీ ‘ఎల్లో బ్రిక్ రోడ్డు’ పుణ్యమా అని ఎవరూ పట్టించు కోని స్కీడామ్‌పై నేడు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తున్నారు.

 ‘‘ఎప్పుడూ మా నగరం ముఖం చూడనివాళ్లు కూడా ఇక్కడికి పదే పదే వస్తూండటం నాకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’’ అంటున్నాడు స్కీడామ్ నివాసి రోనాల్డ్.



‘‘నెదర్లాండ్‌‌సలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు ఈ స్కీడామ్ గురించి చెప్పాడు. ఆసక్తితో అక్కడికి వెళ్లాను. నా ప్రేమ ఫలించాలని మనసులో అనుకుంటూ ఎల్లో రోడ్డు మీద ప్రయాణిం చాను. ఏదో సరదా  కోసం చేసిన పని ఇది. కానీ చిత్రమేమిటంటే కొద్ది కాలంలోనే నేను ప్రేమించిన అమ్మాయితో నాకు పెళ్లి జరిగిపోయింది’’ అంటున్నాడు యువ ఆస్ట్రేలియన్ ఇంజినీర్ హ్యారిసన్.

 

‘ఎల్లో బ్రిక్ రోడ్డు మీద ప్రయాణిం చడం వల్ల మంచి జరుగుతుంది’ అనే ప్రచారాన్ని ఖండిస్తున్నవారు కూడా లేక పోలేదు. అయితే వారి ఖండన మండనల మాట ఎలా ఉన్నా....‘ఇదేదో వింత రోడ్డు’ అనుకునేవాళ్లు, ‘ఒక ప్రయత్నం చేద్దాం’ అనుకునేవాళ్లు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఈ పసుపు పచ్చని రోడ్డు మీద ప్రయాణించి తమ సరదాను తీర్చుకుంటున్నారు.                       



అమెరికన్ రచయిత ఎల్.ఫ్రాంక్ బామ్ రాసిన  ‘ద వండర్‌ఫుల్ విజార్డ్ ఆఫ్ ఓజ్’ నవల చాలా ప్రాచుర్యం పొందింది. 1900 సంవత్సరంలో విడుదలైన ఈ  పుస్తకం పాఠక ఆదరణ చూరగొనడమే  కాదు... అమెరికన్ పాపులర్ కల్చర్‌లో భాగమై పోయింది. ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో 1939లో హాలీవుడ్‌లో కామెడీ-డ్రామా ఫాంటసీ సినిమా రూపుదిద్దుకుంది. ‘ద విజార్డ్’లో  ఎల్లో బ్రిక్ రోడ్డు ఒక ముఖ్య ఆకర్షణ. కాలక్రమంలో ఈ రోడ్డు నవలలో నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది. రెస్టారెంట్ల నుంచి ప్రచురణ సంస్థల వరకు ‘ఎల్లో బ్రిక్ రోడ్’ పేరును వాడుకున్నాయి. స్కీడామ్‌లోని పసుపు పచ్చని రోడ్డుకు ‘ఎల్లో బ్రిక్ రోడ్’ అని పేరు పెట్టింది కూడా అందుకే అని చెబుతుంటారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top