గోళ్లు పూచాయి! | Stencil Nail Art | Sakshi
Sakshi News home page

గోళ్లు పూచాయి!

Jun 12 2016 12:31 AM | Updated on Sep 4 2017 2:15 AM

గోళ్లు పూచాయి!

గోళ్లు పూచాయి!

ఇది స్టెన్సిల్ నెయిల్ ఆర్ట్.. దీన్ని వేసుకోవడానికి తెలుపు, గులాబి రంగు పాలిష్‌లు, స్టెన్సిల్ (మీకు నచ్చిన డిజైన్ ఉన్న స్టెన్సిల్‌ను ఎంచుకోండి) ఉంటే చాలు.

నెయిల్ ఆర్ట్
ఇది స్టెన్సిల్ నెయిల్ ఆర్ట్.. దీన్ని వేసుకోవడానికి తెలుపు, గులాబి రంగు పాలిష్‌లు, స్టెన్సిల్ (మీకు నచ్చిన డిజైన్ ఉన్న స్టెన్సిల్‌ను ఎంచుకోండి) ఉంటే చాలు. నెయిల్ ఆర్ట్‌లో ఎన్నో రకాల డిజైన్స్ వస్తున్నాయి. అందులో ఈ స్టెన్సిల్ నెయిల్ ఆర్ట్ ఒకటి. ఈ ఆర్ట్ చాలా సులువుగా ఉండటమే కాకుండా గోళ్లకు ఎంతో అందాన్ని చేకూరుస్తుంది. చేతికున్న అన్ని వేళ్లకు ఒకే రంగు కాకుండా ఒక్కో గోరుకు ఒక్కో రంగు.. ఒక్కో డిజైన్ వేసుకోవడం ప్రస్తుత ట్రెండ్. మరి ఈ డిజైన్‌ను మీరూ ట్రై చేయండి. ఎలా అంటే...
 
1. ముందుగా చిటికెన, చూపుడు వేళ్ల గోళ్లకు గులాబి రంగు నెయిల్ పాలిష్‌ను వేసుకొని, మిగతా వాటికి తెలుపు రంగు పాలిష్‌ను పూయాలి. ఇప్పుడు ఉంగరం వేలు గోరుపై స్టెన్సిల్‌ను పెట్టుకోవాలి.
 
2. తర్వాత దాని పై నుంచే గులాబి రంగును పూర్తిగా అప్లై చేసి తొలగించాలి.
 
3. ఇప్పుడు స్టెన్సిల్‌పై ఉన్న పువ్వుల్లో ఒక్కదాన్ని మాత్రమే ఉంచి, మిగతా వాటిని కట్ చేసుకోవాలి. ఆ స్టెన్సిల్‌ను మధ్య వేలి గోరుపై పెట్టుకోవాలి.
 
4. దానిపై గులాబి రంగును పూయాలి. తర్వాత ఆ స్టెన్సిల్‌ను తొలగిస్తే ఆ గోరుపై ఒకేఒక్క పువ్వు డిజైన్  వస్తుంది.
 
అలాగే బొటన వేలుకు వేసుకున్నట్టే ఉంగరం వేలుకు కూడా పూర్తి డిజైన్ వేసుకోవాలి. అంతే ఫొటోలో కనిపిస్తున్న విధంగా మీ నెయిల్‌ఆర్ట్ అదిరిపోతుంది. ( వివిధ డిజైన్లలో స్టెన్సిల్స్ స్టేషనరీ షాపుల్లో విరివిగా దొరుకుతాయి. అలా కాకుండా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే.. ఏదైనా ప్లాస్టిక్ రాపర్‌పై బ్లేడ్ లేదా కత్తెరతో మీకు నచ్చిన డిజైన్‌ను కట్ చేసుకొని స్టెన్సిల్‌లా తయారు చేసుకోవచ్చు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement