గులాబి రేకుల ప్యాక్ | Rose Face Pack | Sakshi
Sakshi News home page

గులాబి రేకుల ప్యాక్

Jul 30 2016 10:49 PM | Updated on Sep 4 2017 7:04 AM

గులాబి రేకుల ప్యాక్

గులాబి రేకుల ప్యాక్

గులాబి రేకుల పొడి (ఎండిన రేకులను గ్రైండ్ చేసుకోవాలి) - 2 టేబుల్ స్పూన్లు, పాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు - చిటికెడు

న్యూ ఫేస్
కావలసినవి:
గులాబి రేకుల పొడి (ఎండిన రేకులను గ్రైండ్ చేసుకోవాలి) - 2 టేబుల్ స్పూన్లు, పాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు - చిటికెడు
 
తయారీ: ఓ బౌల్‌లో గులాబి రేకుల పొడిని వేసి, పాలు పోయాలి. అలాగే అందులో పసుపు కూడా వేసి బాగా కలపాలి. మిశ్రమం పొడిగా అనిపిస్తే కాసిన్ని పాలు లేదా రోజ్ వాటర్‌ను కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో జిడ్డుచర్మం, సన్ ట్యాన్ దూరమై, ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.
     
గులాబి రేకులను ఎండబెట్టి, పౌడర్‌గా చేసుకునేంత సమయం లేనప్పుడు... రేకులను పేస్ట్‌గానూ చేసి వాడొచ్చు. గులాబి రేకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. అలాగే ఇందులోని విటమిన్-డి చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలను దూరం చేస్తుంది. అలాగే ముడతలను తగ్గిస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement