వర్ణం: కుండల్లోనూ పండుతోంది! | Japan keen to copy world wonders | Sakshi
Sakshi News home page

వర్ణం: కుండల్లోనూ పండుతోంది!

Feb 9 2014 3:03 AM | Updated on Sep 2 2017 3:29 AM

ఆకారానికి సీతాఫలంలా ఉన్న ఈ పండు రాస్ప్‌బరీ. ఇది బాగా పండే వాతావరణం ఉన్న ప్రదేశాల్లో వాషింగ్టన్ ఒకటి. దీన్ని కుండీల్లో కూడా పండించొచ్చు.

ఆకారానికి సీతాఫలంలా ఉన్న ఈ పండు రాస్ప్‌బరీ. ఇది బాగా పండే వాతావరణం ఉన్న ప్రదేశాల్లో వాషింగ్టన్ ఒకటి. దీన్ని కుండీల్లో కూడా పండించొచ్చు. పైగా ఇది చక్కటి పోషకాలున్న పండు. సాధారణంగా అన్ని పళ్లలో లభించే విటమిన్లతో పాటు కాపర్, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటివన్నీ ఇందులో సమృద్ధిగా ఉంటాయట. ఎక్కడ దొరికినా తినడం వదలకండి!
 
 అగ్నిదేవుడు
 జపనీయుల దేవుడు జపాన్ దేశం టెక్నాలజీకే కాదు... ఆధ్యాత్మికతకు కూడా అంతే కేంద్రం. ప్రముఖంగా పూజలు, సేవలందుకునే అగ్నిదేవుడు ‘కోజిన్’. జపాన్‌లోని ఒసాకా నగరానికి సమీపంలోని ఉన్న ఈ అగ్నిదేవుడి ఆలయాన్ని (కియోషి కోజిన్) ఏటా 35 లక్షల మంది సందర్శించుకుంటారట. అందునా జనవరి, ఫిబ్రవరి నెలల్లో యాత్రికుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుందట. ఫొటోలో చెక్క మందిరంలో కనిపిస్తున్న దేవుడే ‘కోజిన్’. మన ఆలయాల్లో దేవుడి పటాలు అమ్మినట్లే అక్కడా ఇలాంటివి అమ్ముతుంటారట.
 
 సంచిలో పాలున్నాయా మమ్మీ!
 ఈ భూమిపై ప్రతి జంతువుకీ తనదైన ఉనికి ఉంది. కొన్నయితే భలే ఆకట్టుకుంటాయి. అలాంటి జంతువుల్లో ఒకటి కంగారూ. దీని జీవన విధానం ఒక విచిత్రం అయితే, ఆస్ట్రేలియాకే పరిమితం కావడం మరో విచిత్రం. అయితే, కంగారూను ఆస్ట్రేలియా వంటి వాతావరణం ఉన్న ఇతర ప్రాంతాల జంతు ప్రదర్శన శాలల్లో కూడా ఈ మధ్య పెంచుతున్నారు. బిడ్డకు పాలిస్తున్న ఈ ‘కంగారూ’ కాలిఫోర్నియాలోని గల్ఫ్ బ్రీజ్ జూలో సందర్శకులను అలరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement