రాజేంద్రకు మూడు విషయాలు అంటే మాచెడ్డ ఇష్టం. 1.జాతి 2.అంతస్తు 3. గౌరవం...ఈ మూడింటికి ఏ మాత్రం తేడా వచ్చినా, భయపెట్టించేట్టు కనిపించే రాజేంద్ర మరింత భయానకంగా కనిపించగలడు. ఎంత దుర్మార్గానికైనా తెగించగలడు.
జాతి, అంతస్తు, గౌరవం... వీటికి ఎవరైనా దూరంగా జరిగి పెళ్లి చేసుకుంటే... వరుడిని మర్యాదగా కిడ్నాప్ చేసుకొచ్చి..
‘‘ఆ పిల్ల తండ్రికి నువ్వు నచ్చలా. నీకు ఆ పిల్లకు ఏ సంబంధం లేదని రాసివ్వు’’ అని చాలా అమర్యాదగా బెదిరించగలడు.
బయటి వాళ్ల సంగతి సరే...
సొంత కూతురే ప్రేమించి పెళ్లి చేసుకుంటే?అమ్మో! ఇంకేమైనా ఉందా!!
‘‘తెంచేయ్. ఆ తాళిని నీ మెడలో నుంచి తెంచేయ్. తాళిని నీ మెడలో నుంచి తీస్తావా? చేయి విరిచేయనా?’’ అంటూ కన్న కూతురు ముందు రంకెలు వేయగలడు.
ఇక ‘లంక రాజు’ తక్కువోడా ఏమిటి?ఏడుస్తున్న కూతురిని చూస్తూ తన చుట్టూ ఉన్న గూండాలతో ఏమంటున్నాడో చూడండి...‘‘అక్క ఏడుస్తుంది. ఈ విషయం జనాలకు తెలిస్తే ఏమవుతుందిరా?’’‘‘పరువు పోతుందన్నా’’ అంటారు గూండాలు. అప్పుడు ‘లంక రాజు’ ఎంత క్రూరంగా మాట్లాడతాడంటే...
‘‘నేను, నా పరువు ప్రతిష్ఠ బెజవాడలో ఉండాలంటే దీన్నైనా చంపాలి. వాడినైనా చంపాలి’’
‘ప్రేమిస్తే’ సినిమాలో రాజేంద్ర కావచ్చు, ‘కృష్ణ’ సినిమాలో ‘లంక రాజు’ కావచ్చు... డైలాగుల కంటే పర్సనాలిటీ, హావభావాలతోనే తెగ భయపెట్టించాడు కాదల్ దండపాణి.సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందు దిండిగల్ (తమిళనాడు) నగరంలో దండపాణి రకరకాల వ్యాపారాలు చేసేవాడు. తన వ్యాపారమేదో తాను చేసుకుంటున్న దండపాణి డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దృష్టిలో పడ్డాడు.
శక్తివేల్ స్నేహితుల్లో ఒకరు దండపాణి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో చూపించాడు. ఇది సినిమాల్లో అవకాశం కోసం దిగిన ఫొటో కాదు. ఏదో పని కోసం దిగింది. ఫొటో చూసీ చూడగానే ‘నా సినిమాలో ఇతనే హీరోయిన్ తండ్రి’ అనే నిర్ణయానికి వచ్చాడు శక్తివేల్. ‘‘నువ్వు పెద్దగా నటించనక్కర్లేదు. నీ సహజశైలిలో డైలాగులు చెప్పు చాలు’’ అని చెప్పాడు శక్తివేల్. అలా ‘కాదల్’ (తెలుగులో ప్రేమిస్తే) సినిమాలో హీరోయిన్ తండ్రి వేషం ఇచ్చాడు. ఈ పాత్ర దండపాణిని ‘కాదల్ దండపాణి’ని చేసింది. తమిళ్‌తో పాటు తెలుగు,
కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించేలా చేసింది. వృత్తిరీత్యా దండపాణి వ్యాపారి. ప్రవృత్తిరీత్యా నటుడు. అయితే తాను ప్రేమించిన నటనే అతడిని నాలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితుడిని చేసింది.‘ప్రేమిస్తే’ ‘రాజుభాయ్’ ‘ముని’ ‘కృష్ణ’ ‘ఆంజనేయులు’ ‘రేసుగుర్రం’...సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కాదల్ దండపాణి 2014లో ఈలోకాన్ని వీడి వెళ్లారు. కరకు చూపులతో, కఠినమైన గొంతుతో తనదైన విలనిజాన్ని వెండితెరపై ప్రదర్శించాడు కాదల్ దండపాణి.
కరకు చూపుల... కాదల్ దండపాణి
Published Sun, Jul 2 2017 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement