కృష్ణవంశీ ‘అంతఃపురం’ సినిమాలో గుర్తుండే పాత్రలలో ‘జీవీ’ పాత్ర ఒకటి.ప్రత్యర్థులను మందుపాతరతో పేల్చేయడానికి ఉచ్చు బిగించే సీన్ నుంచి, ప్రత్యర్థుల చేతిలో మేకలా బలయ్యే సీన్ వరకు అద్భుతమైన విలనిజాన్ని పండించాడు జీవీ.భారీ డైలాగులేమీ లేకపోయినా భారీ కాయంతో, పొడవాటి వెంట్రుకలతో భయపెట్టాడు. భయానకాన్ని సృష్టించడానికి అతని రెండు కళ్లు వందల ఆయుధాలయ్యాయి. ‘ఎవరీ జీవీ?’ అని అందరూ మాట్లాడుకునేంత గుర్తింపు తెచ్చుకున్న ‘జీవీ’ అసలు పేరు సుధాకర్ నాయుడు. ఈయన చిరంజీవి వీరాభిమాని∙విద్యార్థి సంఘ రాజకీయాలు, క్రికెట్ గురించి తప్ప... ‘నటన’ మీద ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు సుధాకర్ నాయుడు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సుధాకర్ ఆ తరువాత హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
రెండు సంవత్సరాల తరువాత... ఏదో అసంతృప్తి.‘ఇది కాదు... ఇంకా ఏదో చేయాలి’ అనుకున్నాడు.తరువాత యు.ఎస్ వెళ్లి ఇంటర్నేషనల్ లా మాస్టర్స్ చేశాడు. రోజూ జిమ్‌కు వెళ్లడం, జుట్టు పొడవుగా పెంచడంతో పాటు అక్కడి జీవనశైలితో మమేకమైపోయి ఇండో–అమెరికన్‌గా మారిపోయాడు. రెండున్నర సంవత్సరాల తరువాత ఇండియాకు వచ్చాడు. అమెరికా నుంచి తెచ్చిన గిఫ్ట్‌ను తనకు బంధువైన దాసరి నారాయణరావుకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు... పొడవాటి జుట్టు చూసి ‘ఏంటీ ఇలా అయిపోయావు?’ అన్నారు దాసరి.
‘‘అమెరికాలో ఉన్నాను కదా’’ అని చిన్నగా నవ్వాడు సుధాకర్.‘‘అరుణ్‌బాబుతో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. నటిస్తావా?’’ అడిగారు దాసరి.‘‘నాకెందుకు సార్ నటన... కోర్టులో ప్రాక్టీస్ చేయాలి’’ అని మొదట అన్నాడు గానీ దాసరి ఒప్పించడంతో ‘చిన్నా’ సినిమాతో విలన్‌గా పరిచయం అయ్యాడు సుధాకర్ నాయుడు. ఫీల్డ్‌లో సుధాకర్‌లు ఇద్దరు ముగ్గురు ఉండడంతో ‘చిరంజీవి’లోని చివరి అక్షరాలతో సుధాకర్ నాయుడికి ‘జీవీ’గా వెండితెర నామకరణం చేశారు దాసరి. ఈ సినిమా తరువాత ‘అంతఃపురం’లో నటించే అవకాశం వచ్చింది జీవీకి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని జీవీ తెలుగులో మాత్రమే కాదు కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ ‘అగ్రెసివ్ విలన్’గా మంచి గుర్తింపు పొందుతున్నారు.
నాదసలే రఫ్ హ్యాండ్!
Published Sat, May 13 2017 11:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement