వైల్డ్ ఇన్ డిజైన్స్ | Wild In Designs | Sakshi
Sakshi News home page

వైల్డ్ ఇన్ డిజైన్స్

Oct 5 2014 11:55 PM | Updated on Sep 2 2017 2:23 PM

వైల్డ్ ఇన్ డిజైన్స్

వైల్డ్ ఇన్ డిజైన్స్

వరల్డ్ యానిమల్ డేని పురస్కరించుకుని ఆదివారం మారియట్ హోటల్‌లోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు బొమ్మల వెంకన్న,

‘వన’వీధిలో విహరించే వన్యప్రాణుల శైలి ఆటవికం... మన వీధుల్లో కనిపించే మా‘నవ’ సమాజ శైలి ఆధునికం... ఈ రెండింటినీ ఒక చోట చేరిస్తే అదే జీ‘వన’ వైవిధ్యం. వన్యప్రాణులపై అవగాహన కల్పించేందుకు ఫ్యాషన్‌ను, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ‘డేట్ విత్ వైల్డ్ అండ్ బ్యూటిఫుల్’ ఈవెంట్ వైవిధ్యంగా అనిపించింది.

వరల్డ్ యానిమల్ డేని పురస్కరించుకుని ఆదివారం మారియట్ హోటల్‌లోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు బొమ్మల వెంకన్న, వి.నర్సయ్య, మౌక్తిక్‌రెడ్డిలు తీసిన 60కిపైగా వన్యప్రాణుల చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. దీనితో పాటే యానిమల్ టాటూస్‌ను చిత్రించుకున్న మోడల్స్‌తో ర్యాంప్‌వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పేజ్‌త్రీ, ఫ్యాషన్ రంగ ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement