పెషావర్ బాధితులకు హార్ట్ @ తెలంగాణ | Solidarity for Peshawar Victims | Sakshi
Sakshi News home page

పెషావర్ బాధితులకు హార్ట్ @ తెలంగాణ

Dec 30 2014 12:56 AM | Updated on Sep 2 2017 6:55 PM

పెషావర్ బాధితులకు హార్ట్ @ తెలంగాణ

పెషావర్ బాధితులకు హార్ట్ @ తెలంగాణ

ఉగ్రవాదానికి బదులిచ్చే హృదయం తమకుందని తెలంగాణ ఆర్టిస్టులు నిరూపించారు.

ఉగ్రవాదానికి బదులిచ్చే హృదయం తమకుందని తెలంగాణ ఆర్టిస్టులు నిరూపించారు. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఇటీవల టైస్ట్‌ల పాశవిక దాడిలో మృతి చెందిన విద్యార్థులకు, బాధిత కుటుంబాలకు వంద మంది కళాకారులు ఆదివారం శిల్పారామంలో తమ చిత్రకళతో అపూర్వంగా సంఘీభావం (ఆర్ట్ ఫర్ ఎమిటీ) ప్రకటించారు. ఐదు మీటర్ల పొడవైన మూడు కాన్వాసులపై సంతకాలు చేశారు. వర్ణాలు రంగరించారు. చిత్రాలు మలిచారు. ఈ చిత్రాలను యునెస్కోకు అందజేస్తామని  ఆర్ట్ ఎట్ తెలంగాణ ట్రస్టీలు బి.నరసింగరావు, పాపారావు, లక్ష్మణ్ ఏలె, ఆనంద్‌లు తెలిపారు.  ప్రముఖ చిత్రకారులు వైకుంఠం, సూర్యప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement