రక్తపోటు నియంత్రణతో ఆ రిస్క్‌కు చెక్‌

Lower Blood Pressure Slashes The Risk Of Alzheimer - Sakshi

లండన్‌ : అధిక రక్తపోటుతో గుండె జబ్బులు, స్ట్రోక్‌ ముప్పు, కిడ్నీ వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న క్రమంలో బీపీని నియంత్రణలో ఉంచితే అల్జీమర్స్‌, డిమెన్షియా ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం​స్పష్టం చేసింది. రక్తపోటును అదుపులో ఉంచుకునే వారిలో మతిమరుపు రిస్క్‌ 19 శాతం తక్కువగా ఉన్నట్టు 50 సంవత్సరాల పైబడిన 9000 మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఇక వీరిలో డిమెన్షియా ముప్పు 15 తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

రక్తపోటును పూర్తి అదుపులో ఉంచుకోవడం ద్వారా డిమెన్షియా ముప్పును తగ్గించవచ్చని పరిశోధనలో తేలని క్రమంలో ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు మార్గం సుగమమైందని అల్జీమర్స్‌ అసోసియేషన్‌కు చెందిన చీఫ్‌ సైన్స్‌ అధికారి డాక్టర్‌ మారియా కరిల్లో చెప్పుకొచ్చారు. రక్తపోటును మూడేళ్ల పాటు పూర్తిగా అదుపులో ఉంచుకుంటే అది గుండె, మెదడు ఆరోగ్యాలపై సానుకూల ప్రభావం చూపినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్‌ కరోలినాకు చెందిన వేక్‌ ఫారెస్ట్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అథ్యాపకుడు ప్రొఫెసర్‌ జెఫ్‌ విలియమ్సన్‌ వెల్లడించారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top