ఇంటికి వెలుగు | light to house` | Sakshi
Sakshi News home page

ఇంటికి వెలుగు

Mar 17 2015 11:48 PM | Updated on Sep 2 2017 10:59 PM

ఇంటికి వెలుగు

ఇంటికి వెలుగు

ప్రముఖ రచయిత్రి అంజూ పొద్దర్ కలం నుంచి మరో రచన జాలువారింది. తన జీవితంలోని అనుభవాలకు అక్షర రూపమిచ్చిన ఈ ‘హోమ్ దివా’ పుస్తక...

ప్రముఖ రచయిత్రి అంజూ పొద్దర్ కలం నుంచి మరో రచన జాలువారింది. తన జీవితంలోని అనుభవాలకు అక్షర రూపమిచ్చిన ఈ ‘హోమ్ దివా’ పుస్తక ఆవిష్కరణ మంగళవారం సోమాజిగూడ ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్‌లో జరిగింది. ‘ఇంటి వాస్తు, కిచెన్, స్టోర్, చీరలు, శాలువా వాడుకునే తీరు, ఆర్ట్ వర్క్, బుక్స్, ఫొటోగ్రాఫ్, ముత్యాలు, జ్యువెలరీ, గడియారాలను భద్రపరుచుకునే టిప్స్ వంటివెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. బ్యూటిఫుల్ హోమ్‌ను సమర్థంగా నిర్వహించుకునేందుకు గృహిణులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

వారి బాధ్యతలను సులభతరం చేస్తుంది. నా లైఫ్‌లో ఎదురైన సంఘటనలకే అక్షరరూపమిచ్చా. దివా అంటే వెలుగులు. ఆ ఇంటికి కొత్త వెలుగులిచ్చేందుకు దోహద పడుతుందీ పుస్తకం. గతంలో నేను తీసుకొచ్చిన పుస్తకాల కంటే దీనికి మరింత ఆదరణ వస్తుందనుకుంటున్నా’ అన్నారు అంజు. ఇందిర సుబ్బరామిరెడ్డి, ప్రిన్సెస్ సలేహా సుల్తాన్, పింకిరెడ్డి, సంగీతారెడ్డి, డాక్టర్ శశికళ కోలా పాల్గొన్నారు.
  సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement