ఆ టీలతో ముప్పే..

Drinking trendy fruit teas can ruin your smile - Sakshi

లండన్‌ : పలు పండ్ల రసాల మిక్స్‌తో తేనీరు సేవించడం ట్రెండీగా మారిన క్రమంలో ఈ తరహా టీలు దంతాలకు పెనుముప్పు అని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఈ రిఫ్రెషింగ్‌ ఫ్లేవర్‌ టీలకు దూరంగా ఉండటం మేలని సూచించింది. ఫ్రూట్‌ టీలలో ఉండే యాసిడ్‌ దంతాలపై ఉండే ఎనామిల్‌ను కోల్పోయేలా చేస్తుందని, పళ్ల మధ్య గ్యాప్‌లు ఏర్పడే రిస్క్‌ పొంచి ఉందని డెంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. వేడినీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకున్నా ప్రమాదకరమేనని తేల్చిచెప్పారు.

రోజుకు రెండుసార్లు ఫ్రూట్‌ టీ తీసుకునేవారికి దంత సమస్యలు వచ్చే అవకాశం 11 రెట్లు అధికమని లండన్‌ డెంటల్‌ ఇనిస్టిట్యూట్‌ హెచ్చరించింది. పండ్లలో సహజంగా ఉండే యాసిడ్స్‌ వేడినీటిలో మరగబెట్టినప్పుడు అవి దంతాలకు కీడు చేస్తాయని చెప్పుకొచ్చారు. రోజూ లెమన్‌, జింజర్‌ టీ సేవించే 300 మందిని తాము పరిశీలించామని, టీలను వేడిచేసే క్రమంలో పండ్లలో ఉండే రసాయనాలు దంతాలపై మరింత ప్రభావం చూపడంతో దంతాలు దెబ్బతిన్నట్టు వెల్లడైందని అథ్యయనం చేపట్టిన డాక్టర్‌ సరోస్‌ ఓటూల్‌ పేర్కొన్నారు. 
 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top