క్యాట్‌వాక్... మోడల్స్ పిల్లి నడక! కానీ ఈ పిల్లుల ‘క్యాట్‌వాక్’ చూస్తే టాప్ మోడల్స్ కూడా వెనక్కు పోవాల్సిందే. క్యాట్ ఫుడ్ బ్రాండ్ విస్కాస్... నగరంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్యాట్ షో నిర్వహించింది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన ఈ షోలో అందంగా
అలంకరించుకున్న జాతి పిల్లులు హుందాగా నడిచాయి.
ఎదురొస్తేనే అపశకునంగా భావించే పిల్లులు.. ఎప్పుడో పెంపుడు జంతువుల జాబితాలో చేరాయి. ఇప్పుడు ఈ పెట్స్‌కే టాప్ ప్రేయారిటీ ఇస్తున్నారు నగరవాసులు. కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్నారు. ఒక్క నగరంలోనే కాదు ప్రస్తుతం ఇతర దేశాల్లో సైతం డాగ్స్ కంటే క్యాట్స్‌ను పెంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వీటిని పెంచేవారికి... పెట్స్ గురించి సమాచారం తెలియజేయడానికి ఈ ఇంటర్నేషనల్ క్యాట్ షో నిర్వహించింది విస్కాస్. ఇందులో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 130 మేలు జాతి పిల్లులు పాల్గొన్నాయి. ట్రెడిషనల్ లాంగ్ హెయిర్, బ్రిటిష్ లాంగ్ హెయిర్ బ్రీడ్, నార్వేజియన్ బ్రీడ్, అరేబియన్ మావ్ ఇలా 16 రకాల బ్రీడ్స్ ఇందులో పోటీపడ్డాయి. విస్కాస్‌కు ఇది నాలుగో అంతర్జాతీయ షో. వరల్డ్ క్యాట్ షో మ్యాప్‌లో ఇండియాకు స్థానం కల్పించడమే ఈ షో లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో బ్లూ క్రాస్ చైర్‌పర్సన్ అమల... హైదరాబాదీ బిల్లీలను ఫ్రీ
అడాప్షన్ కోసం ఉంచారు.
కలిసొచ్చింది...
‘నా పిల్లి పేరు డస్టీ. నేను పుట్టినప్పటికే మా ఇంట్లో పిల్లి ఉండేది. దానికి రెండు పిల్లలు పుట్టాయి. అందులో ఒకటే ఈ డస్టీ. దీనికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నా ఫీలింగ్స్‌ను, ఎమోషన్స్‌ను ఇట్టే
పట్టేస్తుంది. నేను డల్‌గా కనిపిస్తే సంతోషపెట్టడానికి ‘పిల్లి’మొగ్గలు వేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో నా సిస్టర్‌లా పెరుగుతోంది. దీని పోషణకు నెలకు ఆరువేల రూపాయల దాకా ఖర్చవుతుంది’ అని చెబుతోంది మాసబ్ ట్యాంక్‌లో ఉండే అదీబా. ‘మా సిస్టర్స్‌కు పిల్లులు అంటే చాలా ఇష్టం. అమెరికా నుంచి నాలుగు పర్షియన్ క్యాట్స్‌ను ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకటి 45 వేల రూపాయలు. వీటికి సపరేట్ ఏసీ రూమ్ ఉంది. క్యాట్ ఫుడ్‌తోపాటు స్టీమ్‌డ్ చికెన్, ఫిష్ బాగా తింటాయి. కేజింగ్ నచ్చదు. ఫ్రీగా ఉండటానికే ఇష్టపడతాయి. అందరూ అపశకునంగా భావిస్తారు కానీ పిల్లులతో మాకు కలిసొచ్చింది’ అంటున్నాడు యూసఫ్‌గూడవాసి
మోసిన్‌ఖాన్.
శుభ పరిణామం...
‘పిల్లి ఇండిపెండెంట్ నేచర్ ఉన్న ఫ్రెండ్లీ పెట్. ఇవి ఎదురొస్తే అపశకునంలా భావించడం చూస్తుంటాం. కానీ ఈ క్యాట్ వాక్‌లో 45 జాతుల పిల్లులు నగరం నుంచే పాల్గొన్నాయి. దీనిద్వారా మూఢనమ్మకాలు లేనివారు సిటీలోనూ ఉన్నారన్న విషయం అర్థమవుతోంది. ఇది మంచి పరిణామం’ అన్నారు అమల.
శిరీష చల్లపల్లి
‘క్యాట్‌వాక్’
Published Mon, Mar 9 2015 12:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement