కొత్తగా.. పండగలా..

For traditional celebrations A little more new - Sakshi

ఆకాశం నుంచి నక్షత్రాలు తెచ్చి అల్లినట్టుగా...భూమ్మీద ముగ్గులు తెచ్చి అద్దినట్టుగా...తోకాడించే గాలిపటాలనుగగనానికి పంపినట్టుగా...అంతా పండగలా.. కానీ, కొంచెం కొత్తగా!తెలుగింటి విరిబోణి కట్టు లంగా ఓణీ. 

సంప్రదాయ వేడుక లేదా పండగ అనగానే పట్టు లంగా ఓణీ తలపుకు వచ్చేస్తుంది. ఎప్పుడూ ఒకే టైప్‌ డ్రెస్‌ కోడ్‌ అనే నేటితరానికి మరికొంచెం కొత్తగా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా ఇలాంటి డిజైన్‌ లెహంగా, దుపట్టాలను ఎంపిక చేయచ్చు. అయితే, కలర్‌ కాంబినేషన్స్, అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్లెయిన్‌ కలర్స్‌ అయినా కట్, కుట్టుతో ఇలాంటి కాంబినేషన్‌ ఆకట్టుకుంటుంది. సంప్రదాయ రంగులు అయితే పెద్ద పెద్ద ఆభరణాలు ధరించినా అందంగా కనిపిస్తారు. అదే, స్పెషల్‌ అనిపించే గ్రే, లైట్‌ క్రీమ్, సియాన్‌.. వంటి రంగులకు ఆభరణాల అలంకరణ అంతగా నప్పవు. డిజైన్‌లో ఉన్న తేడాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇతర అలంకరణపై దృష్టి పెట్టాలి. 

►గ్లాస్‌ బీడ్స్, ముత్యాలు, జర్దోసీల కలయికతో ఎంబ్రాయిడరీ చేసిన రా సిల్క్‌ లెహెంగా, జాకెట్టు గ్రాండ్‌గా కనువిందు చేస్తుంది. దీనికి రెడ్‌ కలర్‌ కట్‌వర్క్‌ నెటెడ్‌ దుపట్టా జత చేయడంతో చూపులను కట్టడి చేస్తుంది. 

►జర్డోసీ, గ్లాస్‌ బీడ్స్‌తో ఎంబ్రాయిడరీ చేసిన పసుపు లెహెంగా పండగ సమయంలో ధరిస్తే చూపు తిప్పుకోనివ్వదు. లెహెంగా అంచు రంగును పోలిన నీలాకాశపు కట్‌ వర్క్‌ దుపట్టా మింట్‌ రా సిల్క్‌ డిజైనర్‌ బ్లౌజ్‌ లెహంగాకి పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌.

►సంప్రదాయ వేడుకలకు  చిరునామాగా నిలుస్తాయి ఎరుపు, పసుపు రంగులు. ఎరుపు రంగు రా సిల్క్‌ మీద సీక్వెన్స్‌ వర్క్, జియోమెట్రికల్‌ ప్యాటర్న్‌ బ్లౌ, కట్‌వర్క్‌ దుపట్టా లుక్‌ని అందంగా మార్చింది. బెల్ట్‌ భాగం ప్రత్యేకతను నిలుపుతోంది.

►ముదురు ఎరుపు లంగా, జాకెట్టు దానికి క్రీమ్‌ కలర్‌ దుపట్టా సరైన కాంబినేషన్‌. అయితే ఇందుకు ఫ్యాబ్రిక్‌ ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి. బీజ్‌ టుల్‌ లెహెంగా మీద ఆలోవర్‌ సిక్వెన్‌ వర్క్, జియోమెట్రికల్‌ ప్యాటర్న్‌ బ్లౌజ్, కట్‌వర్క్‌ నెటెడ్‌ దుపట్టా కళను రెట్టింపు చేస్తుంది. 

►లేత గులాబీని తలపించే బీజ్‌ టుల్‌ లెహెంగా, దాని మీద ఆలోవర్‌ సీక్వెన్‌ వర్క్‌ అబ్బురుపరుస్తుంటుంది. దీనికి లేత నీలం రంగు కట్‌వర్క్‌ దుపట్టా, సీక్వెన్‌ బ్లౌజ్‌ ఆకర్షణీయంగా రూపుకట్టింది.

►రా సిల్క్‌ లెహెంగా,  మీద గ్లాస్‌ బీడ్స్, జరీ వర్క్‌ చేయడంతో ట్రెండీ లుక్‌ తీసుకువచ్చింది. లెహెంగా రంగులోనే డిజైనర్‌ బ్లౌజ్, క్రీమ్‌ కలర్‌ నెటెడ్‌ కట్‌వర్క్‌ దుపట్టా జతచేయడంతో అందానికి అంబరమే హద్దుగా మారింది. 

ఫాయిల్‌ప్రింటెడ్‌ రా సిల్క్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన లెహెంగా ఇది. దీనికిజర్దోసీ వర్క్‌ చేసిన బ్లౌజ్‌ని జత చేయడంతో యంగ్‌ లుక్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చేసింది. ఇదే రంగు సీక్వెన్‌ కట్‌ వర్క్‌ దుపట్టాతో లుక్‌ మరింత ఆకర్షణీయంగా మారింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top