ఇన్‌టిప్స్‌

tips of carrot - Sakshi

సాంబారు, రసం పొడులను డీప్‌ ఫ్రీజర్‌లో నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు వాసనపోకుండా తాజాగా ఉంటాయి.
పచ్చళ్ళు, ఊరగాయల్లో స్టీల్‌ స్పూన్లు వాడకూడదు. కోడిగుడ్డు పొరటు మెత్తగా రావాలంటే మూడు టీ స్పూన్ల పాలు కలపాలి.
ఉల్లిపాయలను గ్రైండ్‌ చేసిన వెంటనే వాడాలి, ఆలస్యమైతే చేదవుతుంది. గ్రైండ్‌చేసే ముందు ఉల్లిపాయలను కొద్దిగా నూనెలో వేయిస్తే ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.
క్యారట్‌ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి.
అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి. క్యారట్‌ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది.
పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ళమంట తగ్గాలంటే చల్లటి పాలలో  కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top