ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఈ వారం యూట్యూబ్ హిట్స్ - Sakshi


రెండు ఫెర్న్ మొక్కల మధ్య హిల్లరీ క్లింటన్

బిట్వీన్ టు ఫెర్న్స్ విత్ జాక్ : హిల్లరీ

అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న, అమెరికా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న హిల్లరీ క్లింటన్‌ను జాక్ గాల్‌ఫినాకస్ అనే అతడు ఇంటర్వ్యూ చేస్తున్నారు.

 

ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి.

ఫస్ట్ గర్ల్ ప్రెసిడెంట్ కాబోతున్నారంటే మీకు ఎక్సైటింగ్‌గా ఉందా?

ఒబామా ప్రభుత్వంలో సెక్రెటరీగా ఉన్నప్పుడు మీరు నిమిషానికి ఎన్ని పదాలు టైప్ చేసేవారు?

ఒబామా కాఫీ ఎప్పుడు తాగుతారు? నీరసంగా ఉన్నప్పుడా?

మీరు ప్రెగ్నెంట్ అయితే ఏం జరుగుతుంది?

ఆ తొమ్మిది నెలలు అమెరికన్ ప్రజల్ని  వైస్ ప్రెసిడెంట్ టిమ్ కెయిన్ పాలిస్తారా?

 (రెండు మూడు ప్రశ్నల తర్వాత హిల్లరీ విసుగ్గా ముఖం పెడతారు. ‘ది కంట్రీ గోస్ టు షిట్’ అని జాక్ కూడా విసుక్కుంటారు).

 ఇంటర్వ్యూ కొనసాగుతుంది.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఎంత బాగుంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా?

ఒకవేళ ట్రంప్ ప్రెసిడెంట్ అయి, కిడ్ రాక్ విదేశాంగ కార్యదర్శి అయితే మీరు కెనడాగానీ, ఆర్కిటిక్‌గానీ పారిపోతారా?

వ్వాట్! అమెరికాలోనే ఉండిపోతారా! అంటే అంతర్యుద్ధానికి మీరు నాయకత్వం వహిస్తారా?

మీ ప్యాంట్స్, సూట్స్ కుట్టే టైలర్‌ని కలవాలనుంది నాకు.

ఎందుకంటే హెలోవీన్ ఫెస్టివల్‌కి నేను లైబ్రేరియన్‌లా తయారై, అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నాను.

డిబేట్‌కు మీరు ఎలాంటి బట్టలు వేసుకుని వెళ్లాలనుకుంటున్నారు?

మీ ప్రత్యర్థి ఎలాంటి బట్టలు వేసుకోవాలని కోరుకుంటున్నారు?

మీ అమ్మాయి చెల్సియా, ట్రంప్ కూతురు ఇవాంకా ఫ్రెండ్స్ అయి ఉంటే కనుక వాళ్లిద్దరూ బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడుకునేవాళ్లా? చెల్సియాకు వాళ్ల డాడీలా లవర్స్ ఉన్నారా?

మీతో కాంటాక్ట్‌లో ఉండాలంటే ఎలా? ఈమెయిల్?

 

ది ఎండ్.

ఇంటర్వ్యూ అయిపోయింది.

ఈ ప్రశ్నలన్నిటికీ హిల్లరీ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఏం చెప్పారన్నది వీడియోలో చూడండి.

బై ది వే... జాక్ గాల్‌ఫినాకస్..అమెరికన్ యాక్టర్, స్టాండప్ కమెడియన్. ‘ఫన్నీ అండ్ డై’ అనే ఒక కామెడీ అమెరికన్ వీడియో వెబ్‌సైట్ కోసం ఆయన హిల్లరీని ఇలా ఇంటర్వ్యూ చేశారు. మూడు రోజుల క్రితమే ఇది యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయింది. చూడకపోతే చాలా మిస్ అవుతారు.గంట ముందే తెలిసిపోతుంది!

న్యూ టాలెంట్

వన్ అవర్ : తెలుగు షార్ట్ ఫిల్మ్


చాలామందికి భవిష్యత్తు తెలుసుకోవాలనిపిస్తుంది. జాతకం చెప్పించుకుంటారు. అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చుపెడతారు. అయితే జరగబోయేవి మంచివైతే పర్వాలేదు. ఒక గంటలో ఎవరినో చంపబోతున్నామని తెలిస్తే? ఊహించడానికే భయంగా ఉంది కదా! గంట ముందు కాదు కదా.. నిమిషం ముందు జరగబోయేది తెలిసినా దాన్ని తట్టుకోవడం కష్టం. ఈ ‘వన్ అవర్’ షార్ట్ ఫిల్మ్ కథా సారాంశం ఇదే. మంచి ఫిక్షన్.

   

తిరుపతిలో బిటెక్ చదువుతూ, చదువు మీద కంటే సినిమాల మీదే శ్రద్ధ, భక్తి ఉన్న జి.బి.కృష్ణ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. అందరూ ప్రేమకథలు తీస్తుంటే, అందుకు భిన్నంగా తను ఒక మంచి కథ తీయాలనుకుని కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతలన్నీ తనే నిర్వహించాడు కృష్ణ. ఇంతకుముందు ఇతడు పూరి జగన్నాథ్ ‘టెంపర్’ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేశాడు. ఈ ‘వన్ అవర్’ అనేది కృష్ణ తీసిన తొలి షార్ట్ ఫిల్మ్.

   

ఇందులో కథానాయకుడి పేరు సుధీర్. గంట ముందు తాను ఏం చేయబోతుందీ అతడికి ముందే తెలిసిపోతుంటుంది. అదీ అతని సమస్య. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. గతంలో జరిగిన సంఘటనలన్నిటి గురించీ డాక్టర్‌కు చెబుతాడు. దీన్నే ఫ్యూచర్ సెన్స్ అంటారనీ, మైండ్‌ని కూల్‌గా ఉంచుకోమనీ డాక్టర్ చెబుతాడు. ఏడాదిగా తను ప్రేమిస్తున్న అమ్మాయిని తను ఇంకో గంటలో చంపబోతున్నట్లు తనకు తాజాగా వైబ్రేషన్ వచ్చిందని చెబుతాడు సుధీర్. నిద్రమాత్రలు వేసుకుని పడుకోమని సలహా ఇస్తాడు డాక్టర్. కానీ ఆ సలహా పని చేయదు. గంటలోనే సుధీర్ తన ప్రియురాలిని చంపేస్తాడు.  తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ.  విశేషం ఏమిటంటే సినీ నటి రోజా ఈ షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించి, ఈ యువకుడిని ప్రోత్సహించారు. ఎంతో అందంగా, చక్కగా తీసిన ఈ లఘుచిత్రంలో డైలాగులు ప్రత్యేక ఆకర్షణ.

 - వైజయంతి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top