
ఇంకా వెలగని వైరు దీపం!
మనం ఒక రోజు కరెంటు లేకపోతే విలవిలలాడిపోతాం. ఆధునిక జీవితానికి అంతలా అలవాటు పడిపోయాం. కానీ మనదేశంలో ఇంకా కోట్లాది మందికి విద్యుచ్ఛక్తి సౌకర్యం లేదు.
మనం ఒక రోజు కరెంటు లేకపోతే విలవిలలాడిపోతాం. ఆధునిక జీవితానికి అంతలా అలవాటు పడిపోయాం. కానీ మనదేశంలో ఇంకా కోట్లాది మందికి విద్యుచ్ఛక్తి సౌకర్యం లేదు. నిజమే! మన ప్రభుత్వాలు గ్రామాలను విద్యుదీకరించి దాదాపుగా ఆరు దశాబ్దాలవుతోంది. కానీ ఇంకా అనేక గ్రామాలు గుడ్డిదీపాల వెలుగులోనే కాలక్షేపం చేస్తున్నాయి. ‘ప్రతి ఒక్కరికీ విద్యుత్ వెలుగులు’ అనే సదుద్దేశం నెరవేరలేదు. ఈ విషయం అధికారిక గణాంకాల ఆధారంగా బయటకు రాలేదు, సునీలా కాలే చేసిన అధ్యయనంలో రుజువైంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల.
భారతదేశంలో సామాజిక స్థితిగతుల మీద ఆమె చేసిన అధ్యయనంలో ఇదోభాగం. ఆమె రాసిన ‘ఎలక్ట్రిఫయింగ్ ఇండియా, రీజనల్ పొలిటికల్ ఎకానమీస్ ఆఫ్ డెవలప్‌మెంట్’ పుస్తకాన్ని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఇటీవల ప్రచురించింది. సునీల ఈ పుస్తకంలో విద్యుత్‌రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా విద్యుత్ విధానాలు రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారిపోతున్నాయి. ప్రైవేట్ విద్యుత్ రంగం కుగ్రామాలను విద్యుదీకరించడం కంటే పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ సరఫరా మీదనే దృష్టి సారిస్తోందన్నారు.